Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ భాస్కర్రావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రజా ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పిర్యాదుదారులు 44 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి, భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, పంచాయతీలకు సంబంధించినవి, ఎస్సీ కార్పొరేషన్, ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో మోతిలాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.