Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కోసం ఫిబ్రవరి 9న హైదరాబాదులో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు కార్మికులకు పిలుపునిచ్చారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆయన విడుదల చేసి మాట్లాడారు. ఇండ్ల స్థలాల కోసం అనేక జిల్లాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు గత ఆరు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, కొన్ని గ్రామాలలో, పట్టణాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన పేదలకు కేటాయించలేదని. తక్షణమే పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లక్షలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారని, సొంత ఇల్లు లేకపోవడం వల్ల పేదలు తాము చేసిన కష్టాన్ని అద్దెకే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామి ప్రకారం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్లో జరిగే మహాధర్నాలో లబ్ధిదారులందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, చిట్యాల మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరు కుమారస్వామి, మెట్టు పరమేష్, రామానుజమ్మ, కల్లూరి లక్ష్మయ్య, రాములు, నర్సింహ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వీరనారి సాకలి ఐలమ్మ స్వగ్రామం పాలకుర్తి నుండి హైదరాబాద్ వరకు తలపెట్టిన పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను సోమవారం మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామపంచాయతీలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు వట్టిపల్లీ హన్మంతు, పెరుమాండ్ల మంజుల, తుప్పరి యాదయ్య, పూలే ముత్తమ్మ, బొడ్డుపల్లి మోహనయ్య, ఒంపు వెంకటయ్య, ఎడ్ల నరసింహ, ఎడ్ల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.