Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -మోత్కూర్
మండలంలోని పనగబండ గ్రామంలో ఉన్న డైమండ్ హెచరీస్ పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యం అకారణంగా ఆపేసిన ఏడుగురు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన డైమండ్ పౌల్ట్రీ ఫామ్లో కార్మికులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైమండ్ చికెన్ ప్రొడక్ట్స్ (ప్రై.) లి .ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రి.నెం ఎ/టియు/06/2023 సీఐటీయూ అనుబంధం చేస్తూ నూతనంగా యూనియన్ ఏర్పాటు చేశామని తెలిపారు. వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కార్మికులకు పనిభారం తగ్గించాలని, వేతనాలు పెంచాలని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం యాజమాన్యానికి యూనియన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను, నూతన కమిటీని పరిచయం చేశారు. కార్మికులకు హక్కులతోపాటు బాధ్యతలను కూడా యూనియన్ గుర్తు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ల రాములు, మండల కన్వీనర్ సామ శ్రీనివాస్ రెడ్డి, పౌల్ట్రీ ఫామ్ ఎండి శోభారాణి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నర్సయ్య, జి. శ్రీనివాస్, నాగరాజు, వెంకట్ రెడ్డి, బీరయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.