Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ- ఆలేరురూరల్
బడ్జెట్లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు అన్నారు .మంగళవారం మండలంలోని శర్బనాపురం గ్రామంలో ఇంటింటి సీపీఐ(ఎం) కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2023.. 24 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూపాయలు 26,831 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పటికీ ప్రభుత్వ వ్యయ వాల్యూ రెండులో వ్యవసాయానికి రూపాయలు 20, 890 కోట్లు మాత్రమే కేటాయించబడ్డాయని ఆర్థిక మంత్రి చెప్పిన పద్దు పరిశీలించిన అందులో రైతుల రుణమాఫీకి రూ.6385 కోట్లు కేటాయించారు. లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఈ నిధులతో రైతుల రుణాలు మాఫీ కావునన్నారు ఇప్పటికైనా అనేక జిల్లాలో రైతులు డిఫాల్టర్లుగా మారారన్నారు కావున ఏకకాలంలో రుణమాఫీ నిధులు పెంచాలన్నారు . రైతుబంధుకు రూపాయలు 15075 కోట్లు రైతు బీమాకు 1589 కోట్లు కేటాయింపు చూపారన్నారు ఈ మూడు పద్దుల మొత్తం 23049 కోట్లకు చేరుకుందన్నారు.. ఇక మిగిలింది రూపాయలు 3 332 కోట్లు మాత్రమే అన్నారు ఈ బడ్జెట్లో పరిశోధనాలకు గాని ప్రకృతి వైపరీత్యాల పరిహారం చెల్లింపులకు గాని హార్టికల్చర్ అభివృద్ధికి గానీ పెద్దగా కేటాయింపులు లేవన్నారు ఆయిల్ ఫామ్ తోటల పెంపునకు అధిక ప్రాధాన్యత ఇచ్చి లక్షల ఎకరాలలో వేయిస్తామని రైతులకు 50 శాతం నుండి 90 శాతం రాయితీ ఇస్తామని ప్రకటన చేసి దానికి తగిన నిధులు కేటాయించలేదన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 171. 20 లక్షల కాగా వాస్తవంగా సాగయ్యిందన్నారు.94.86 లక్షల ఎకరాలు కాగా ఇందులో 82 శాతం సన్న చిన్న కారు రైతులు ఉన్నారన్నారు రైతు బంధు రైతు బీమా మినహాయిస్తే మిగిలిన అంశాలకు కేటాయింపులు లేవన్నారు రైతు బీమా ను 18 నుండి 59 కాకుండా 18 నుండి 70 సంవత్సరాల వరకు పెంచాలని రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయన్నారు కౌలు రైతులకు ఏ పథకం ప్రకటించలేదు. ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు లేవ అని ప్రశ్నించారు ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని పూర్తిగా మినహాయించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుదగాని సత్య రాజయ్య ,బుగ్గ నవీన్ ,గ్రామ శాఖ కార్యదర్శి సిరిగిరి సారయ్య, మాజీ గ్రామ శాఖ కార్యదర్శి కారే రాజు, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు విప్లవ్ కుమార్ ,పార్టీ నాయకులు అంగడి నగేష్, సుదగాని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.