Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులకు సముచిత గౌరవం కల్పిస్తాం
- ఎమ్మెల్యే చిరిమర్తి లింగయ్య
నవతెలంగాణ- రామన్నపేట
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటు, నాయకులకు సముచిత గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు, రూ.40 లక్షలతో రంగమ్మగూడెం గ్రామ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.11.60 లక్షల వ్యయంతో కక్కిరేణి ప్రాథమిక పాఠశాలలో కల్పించిన మౌలిక వసతులను జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఈవో నారాయణ రెడ్డిలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో గ్రామాలు మెరుగైన సౌకర్యాలతో గ్రామాలన్నీ శశ్యశ్యామలం అయ్యాయన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయన్నారు. దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని, మరింత శక్తిని ఇవ్వాలని సూచించారు. కక్కిరేణి - పిల్లిగూడెం రోడ్డు మరమ్మతులకు రూ.25 లక్షలు, కక్కిరేణి - మాండ్ర రోడ్డు మరమ్మతులకు రూ. 10 లక్షలు మంజూరు చేశామన్నారు. అంగన్ వాడీ భవనానికి, యాదవ సంఘం మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబోయిన జ్యోతి, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదరు రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, కక్కిరేణి గ్రామ సర్పంచ్ సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు గుత్త నరసింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, ఉప్పు ప్రకాష్, రేఖ యాదయ్య, కోళ్ల స్వామి, బందెల యాదయ్య, మెట్టు మహేందర్ రెడ్డి, చెరుకు సోమయ్య, ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, దోమల సతీష్, ఏనుగు జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.