Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ను విద్యార్థులంతా జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఈనెల 12న ఎస్ ఎల్ ఎన్ ఎస్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థుల టాలెంట్ జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యయనం పోరాటమని నినాదం ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెన్ను తట్టి వెలికి తీసే విధంగా ఎస్ఎఫ్ఐ ప్రోత్సహిస్తున్నదని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం పోరాడుతూనే విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలని ఈ పోటి ప్రపంచంలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులను కోరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నీల లక్ష్మణ్, చింతకింది రాహుల్, బత్యం సందీప్, మహేష్ ,గణపురం భరత్, భోగ సూర్య నారాయణ,తదితరులు పాల్గొన్నారు.