Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నలంద డిగ్రీ కళాశాల చైర్మెన్ బత్తుల శంకర్ తెలిపారు. మంగళవారం పట్టణకేంద్రంలోని జయశ్రీ ఫంక్షన్హాల్లో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానంచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజశేఖర్, డైరెక్టర్లు శ్రీనివాస్, మల్లేశ్, దుర్గయ్య, లింగస్వామి, అధ్యాపకులు అంజయ్య, శ్రీనప్ప, రాములు, గోపి, మహేశ్, కల్యాణి పాల్గొన్నారు.