Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
పల్లెలు అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని ఎల్గలగూడం గ్రామంలో నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమి రెండు గుంటలు భూమి దానం చేసిన సీపీిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తో కలిసి ఎమ్మెల్యే గ్రామపంచాయతీ భవనం నిర్మాణంకు శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివద్ధి కోసం పార్టీలకతీతంగా కృషి చేసినప్పుడే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని అన్నారు . మండలంలోని ఎల్గలగూడం గ్రామనికి 30 లక్షల సీసీ రోడ్లకు 20 లక్షలు కచలాపురం గ్రామంలో 30 లక్షల సీసీ రోడ్లకు, రావిగూడం గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి , మునుగోడు పట్టణంలో ఒక కోటి 50 లక్షల విలువగల సీసీ రోడ్ల , డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వెలగలగూడెం గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి దానం చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యాన్ని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటీ స్వామియాదవ్, వైస్ ఎంపీపీ అనంత వీణ లింగస్వామి, మండల అభివృద్ధి అధికారి కే జానయ్య,పి ఆర్ డి ఈరఘుపతి,ఏఈ రామకృష్ణ ఎలగలగూడెం సర్పంచ్ సురిగి చలపతి,కచలాపురం సర్పంచ్ గురుజ అరుణ రామచంద్రం, రావి గూడెం సర్పంచ్ గుర్రం సత్యం, మునుగోడు సర్పంచ్ మిరియాల వెంకన్న, మునుగోడు ఎంపిటిసి ఈద నిర్మల శరత్ బాబు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి తీర్పారి వెంకటేశ్వర్లు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈదులకంటి కైలాస్, కట్కూరి లింగస్వామి మిరియాల మధుకర్ రావిరాల కుమారస్వామితదితరులు పాల్గొన్నారు.