Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎన్నెస్పీ క్యాంపు క్వార్టర్స్‌లో జీవో 58, 59ల ప్రకారం ప్రస్తుతం నివాసం ఉన్నవారికి రెగ్యులరైజ్ చేయాలని ఆ కాలనీవాసులు మంగళవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 40 ఏండ్లుగా క్యాంపు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నామని తెలిపారు.ఉద్యోగం చేసే సమయంలో ఇంటిఅద్దెలు అంతగా లేకపోయినా హెచ్ఆర్ఏ పూర్తిగా చెల్లించామని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్‌ను వేలాది రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించుకున్నామన్నారు.తాము కట్టిన హెచ్ఆర్ఏ, మరమ్మతుల ఖర్చును లెక్కిస్తే కొత్త ఇంటిని కొనుక్కోవచ్చని చెప్పారు.వ్యయ ప్రయాసాలతో ఎన్నో ఏండ్లుగా తాము నివాసము ఉంటున్నామన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్ అమృతం దుర్గా సత్యం, కుతుబుద్దీన్, కాలనీ సాధన కమిటీ సభ్యులు మందడి లక్ష్మమ్మ, గౌసియా, సాలెహ, మురళి, బాస్కర్, రాజరత్నం,గంగాధర్, బాషా, దనుయాంజయ రెడ్డి, మరియన్న, రవి తదితరులు ఉన్నారు.