Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మావతిరెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని యర్రవరం గ్రామం దూళ్ల గుట్ట స్వయంభు వైకుంఠ బాల ఉగ్రనారసింహాస్వామి దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మావతిరెడ్డి అన్నారు. మంగళవారం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయకమిటీ, స్థానిక ప్రజలతో నూతన ఆలయ నిర్మాణం గురించి చర్చించారు. తనవంతుగా నూతన ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.మార్చి 10న నిర్వహించే ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానన్నారు. యర్రవరం గ్రామానికి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషితో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణానికి ఉపాధిహామీ నిధుల నుండి రూ.10 లక్షలు, ఎంపీ నిధుల నుండి రూ.5లక్షలు మంజూరుచేశామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామఅధ్యక్షులు లతీఫ్, మాజీ అధ్యక్షులు మధు, దేవాలయ చైర్మెన్ నలజాల జగన్నాథం, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.