Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో బుధవారం ఆందోళన కార్యక్రమం చేసే సందర్భంలో స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూరాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు . పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజురీయీంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల సహాయకార్యదర్శి పోలేపాక విష్ణు,గుగ్గిల భారత్,ఉపేందర్,ఇమ్మానిల్ చింటూ,చంటి సాయి తదితరులు పాల్గొన్నారు.