Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్,పాలకవర్గ సభ్యులు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రాచకొండలో ఓసియన్ ప్రెస్టేజ్ యజమానులు లేఅవుట్ చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉందని సర్పంచ్ ఒగ్గు గణేష్ పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొన్ని వార్త పత్రికల్లో ప్రచురితమౌతున్న వార్త కథనాలకు స్పందించిన గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాచకొండలోని 84 సర్వే నెంబర్ లో ఓషన్ ప్రెస్టేజ్ వారు చేసిన బి2 బ్లాక్ లో చేసిన లేఅవుట్లో నిబంధనలకు అనుగుణంగా ఎకరాలు 15.19 గుంటల భూమి గ్రామపంచాయతీకి ఇచ్చారన్నారు.ఈ భూమి ఎట్లాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా గ్రామపంచాయతీ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నారు. పక్కనున్న వారి సరిహద్దుల వివాదాల కారణంగా వాటర్ బాడీస్,సీలింగ్ భూమి సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియ లో భాగంగా బి2 బ్లాక్ ఓషన్ ప్రెస్టేజ్ లేఔట్ ప్లాట్ ఓనర్స్ వారికీ సంభందించిన ఎకరాలు 154 .30 భూమిని డీిఐ సర్వేయర్, చౌటుప్పల్ మండల సర్వేయర్, నారాయణపురం రెవిన్యూ అధికారి చౌటుప్పల్ ఆర్డిఓ ఆదేశాలతో సర్వే చేయించుకొని వారి భూమికి సంబంధించిన మొత్తానికి ఆమోదం పొందిన సర్వే డ్రాయింగ్‌ను పొందిఉన్నట్టు తెలిపారు. ఆ సర్వే డ్రాయింగ్ ప్రకారం లేఅవుట్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.ఆ మార్పులకు అనుగుణంగా గ్రామపంచాయతీకి చెందిన 10 శాతం భూమిలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. అప్పటి రాచకొండ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం నెం: 3 ప్రకారం 2007 జూన్ 12న ఇచ్చిన తీర్మానాన్ని సవరిస్తూ 2022 ఏప్రిల్ 6న,2023 జనవరి 16న మరో రెండు తీర్మానాలు ఇస్తూ బి2 బ్లాక్ లో ఓషన్ ప్రెస్టేజ్ లేఔట్ వారికీ లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. అప్పటి నల్గొండ జిల్లాకు చెందిన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్,నారాయణపురం మండల రెవిన్యూ ఆఫీసర్ ఆమోదంతో ప్రెస్టేజ్ ఎవెన్యూస్ లిమిటెడ్ వారికీ సంభందించిన బి2 బ్లాక్ లో 154 .30 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ అన్ని అనుమతులను పొంది వివిధ సైజుల్లో ప్లాట్స్ చేశారన్నారు.ఓషన్ ప్రెస్టేజ్ లేఔట్ ప్లాట్లలయజమానులు ఇతర బ్లాకులకు సంభందించిన ప్లాట్ ఓనర్స్‌తో కలసి రాచకొండ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సొసైటీని, తెలంగాణ ప్రభుత్వం తో రిజిస్ట్రేషన్ నెంబర్: 348 /2015 గా నమోదు చేసుకున్నట్టు పేర్కొన్నారు. యున్నారు. ఈ సొసైటీ ఓషన్ ప్రెస్టేజ్ లేఅవుట్ ప్లాట్స్ అభివద్ధి కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. పొరుగున ఉన్న భూస్వాములు అందరు పరస్పర అంగీకారంతో తమ సరిహద్దులను సరిచేసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వము ద్వారా గ్రామస్థులకు పంపిణి చేసిన భూమికి సరిహద్దులు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రెస్టేజ్ ఎవెన్యూస్ లిమిటెడ్ ప్రమోటర్లు గతంలో పొందిన అనుమతుల ప్రకారం, గ్రామపంచాయతీ కి బి2 బ్లాక్ తరపున అప్పగించాల్సిన 10శాతం భూమిని గ్రామ పంచాయతీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయలేదు. ప్రస్తుతం ప్రమోటర్లు అందుబాటులోలేరని పేర్కొన్నారు.ఇప్పుడు రాచకొండ ప్రెస్టేజ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బి2 బ్లాక్ ఓషన్ ప్రెస్టేజ్ లేఔట్ కు సంభందించిన ప్లాట్ ఓనర్స్ రాచకొండ గ్రామపంచాయతీకి అప్పగించ వలిసిన 10శాతం భూమిని స్వచ్చందంగా 15.19 ఎకరాల భూమి కి సరిహద్దులు నిర్ణయించి గ్రామపంచాయతీకి అప్పగించారని పేర్కొన్నారు. అదేవిధంగా బి వన్ బ్లాక్ లో ఓసియన్ ప్రెస్టేజ్ లేఅవుట్ ప్లాట్ యజమానుల కు సంబంధించిన 199 ఎకరాల భూమిని మండల రెవెన్యూ అధికారి ద్వారా ప్రభుత్వ సర్వేయర్ తో సర్వే చేయించుకున్నారని పేర్కొన్నారు. సర్వే డ్రాయింగ్ లో జరిగిన స్వల్ప మార్పుల కనుగుణంగా గ్రామపంచాయతీకి ఇవ్వాల్సిన 10 శాతం భూమిలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. పై తీర్మానాల ప్రకారం డి వన్ బ్లాక్ లో 199 ఎకరాలు ప్లాట్లు చేశారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఇవ్వాల్సిన 10 శాతం భూమిని స్వచ్ఛందంగా 19.36 ఎకరాల భూమిని సరిహద్దులు నిర్వహించి గ్రామపంచాయతీకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని, అధికారుల సైతం ఆ పనిలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.