Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురం
పేదలకు ఇంట్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంటి జాగాలు ఉన్నవారికి నిర్మాణాలకు రూ.5.లక్షలు ఇవ్వాలన్నారు. ఎన్నికలముందు పేదలు,నిరుద్యోగులు,వ్యవసాయ కార్మి కులకు, రైతులకు,దళిత గిరిజనులకు ఇచ్చినహామీలు అమలు చేయాలన్నారు. నిత్యవరవస్తువుల,గ్యాసు, పెట్రోలు, డీసిల్ ధరలు తగ్గించాలన్నారు. 57 ఏండ్లు నిండిన వాల్లకు వద్దాప్యపెన్షన్ ఇ వ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో.సీపీఐ (ఎం)జిల్లా కమిటిసభ్యులు గుంటోజు శ్రీనివాస్‌చారి,మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి,సీనియర్ నాయకులు తుమ్మల నర్శి రెడ్డి, మండలకమిటీ సభ్యులు చింత కాయల నర్సిహ్మ, కర్తాల భిక్షం,పిట్ట రాములు,జనిగల నర్సింహా,సురి కష్ణమూర్తి, కార్య దర్శిలు దవుల జంగయ్య, సూర్వి కిరణ్,గంగ దేవి బిక్ష్పపతి,కుక్కల అంజుయ్య,కేసిరెడ్డి యాదవరెడ్డి,సిరగొని మారయ్య,బద్దుల వెంకటేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.