Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ-గుండాల
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివద్ధి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి,ప్రజలకి ఒరిగిందేమి లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అన్నారు. మూడవరోజు మాసాన్ పల్లి,సీతారాంపురం, కొమ్మాయిపల్లి,వెల్మజాల గ్రామాల ప్రజలు కోలాటం, డప్పు చప్పుల్లతో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు,నిధులు, నియామకాలంటూ గద్దెనెక్కిన కెసిఆర్ ఫామ్ హౌస్లో ఉంటూ రాష్ట్ర ప్రజలను విస్మరించారన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు గొల్ల కురుమలకు గొర్ల యూనిట్లు, దళితులకు దళిత బంధు గుర్తుకు వస్తాయని ఓట్లు వేయించుకొన్న తర్వాత మొహం చాటేస్తాడని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతు సబ్బండ వర్గాలను ఏకం చేయడానికి కాంగ్రెస్ పార్టీ జోడోయాత్ర ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అండెం సంజీవరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్,పీఏసీఎస్ చైర్మెన్ లింగాల భిక్షం గౌడ్,వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి, మాసాన్ పల్లి సర్పంచ్ ఏలూరి రాం రెడ్డి,ఎంపీటీసీలు కేమిడి అనిత రవికుమార్,సంగి అలివేలు వెంకటాద్రి,కొర్న నరేష్,సింగిల్ విండో డైరెక్టర్లు పాలడుగు ఐలయ్య,పొన్నగాని అంజయ్య నాయకులు చుంచు యాదగిరి,పొన్నగాని నారాయణ,జోగు శ్రీశైలం,కాలి వెంకన్న,మంద రాములు,భాస్కర్,శీను తదితరులు పాల్గొన్నారు.