Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్
నవతెలంగాణ -రామన్నపేట
ఎండాకాలం వరి పంటల సాగులో వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు చిరు పట్ట దశలో కాండం తొలిచూపురుగు అధికంగా కనిపిస్తుందని దీనిపై సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన తెల్ల కంకులు ఏర్పడి, తాలు గింజలు ఏర్పడతాయని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత బి.అనిల్‌కుమార్ శాస్త్రవేత్త బి. మధు శేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, కొమ్మాయిగూడెం గ్రామాలలోని వరి చేలను స్థానిక మండల వ్యవసాయాధికారి బి. యుదగిరి రావు తో కలసి పరిశీలించారు. రైతును అడిగిన పలు సమస్యలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా వరి పంటచెల్లల్లో కాండంతో రుచి పురుగు కనిపించిందని రైతులు సత్వరమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వారు సూచించారు. కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ - 400 గ్రాములు లేదా క్లోరానాత్రి నిలిప్రోల్ - 60 ఎం ఎల్ పిచికారి చేయాలన్నారు. చిరు పొట్ట దశలో ఉన్న వరిపైరుకు 5 సెంటీమీటర్ల వరకు నీటిని పాలంలో ఉంచాలన్నారు. ఈనే దశలో ఉన్న వరి పాలములో అడపదడపా నీటిని తీసివేసి ఎండనివ్వాలన్నారు. తద్వారా దోమపోటు మరియు సల్ఫయిడ్ ఇంజురీస్ను నివారించవచ్చన్నారు. చిరుపొట్ట దశలో ఉన్న వారిలో ఎకరానికి 50 కిలోల యూరియా తో పాటు 15 కిలోల పొటాష్ ఎరువులను వెయ్యాలన్నారు. కొన్ని గ్రామాల్లోని రైతులు వరి పంట పొలాలలో డీజిల్ ను వినియోగిస్తున్నారని, డీజిల్ పంట పొలాల్లో చల్లడం వల్ల హానికరంగా మారుతుందని వారు తెలిపారు. వరిలో ఉన్న పలు మిత్రపురుగులు, వానపాములు, పలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుందన్నారు. నేలపై తెట్టలాగ ఏర్పడటం వల్ల వరి మొక్కలకు హాని కలుగుతుందన్నారు. చౌడు మరియు లోతట్టు ప్రాంతాల్లో సాగుచేస్తున్న వరిలో మొక్కలు చనిపోవడం వల్ల మొక్కల సంఖ్య పలుచగా ఉందన్నారు. ఈ పరిస్థితి నుండి వరిని కాపాడుకోవడానికి వానాకాలంలో జిలుగ లేదా జనుము వేసి కలియదున్నాలన్నారు. వీలయినంతవరకు సేంద్రియ ఎరువులైన మాగీన పశువుల పెంట, కోళ్ళ ఎరువు, వర్మికంపోస్టు వేయాలన్నారు. ప్రతి 3 పంటల కొకసారి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను, మిగతా అడుగు మందులలో కలపకుండా దుక్కిలో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకటేష్, కిరణ్, వెంకన్న పాల్గొన్నారు.