Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
గ్రామాలభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధశారం భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ హెచ్ఎండీఏ నిధులు 15 లక్షల తో సీసీి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్డీఎఫ్ నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు గ్రామాలభివద్ధికి ఇన్ని లక్షల రూపాయలు కేటాయించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు పరుస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
జూనియర్ కళాశాలలో పనులు పరిశీలన
పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో గ్రౌండ్ లెవెలింగ్ పనులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు చేశారు.పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం వినాయక చౌరస్తా వద్దా (బస్టాండ్ వెళ్లే దారిలో) సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా నాణ్యమైన పనులు చేయాలన్నారు.