Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజాహిత కార్యక్రమాలలో అనేక రూపాల ద్వారా దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మండలములోని బస్వాపూర్ గ్రామం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పక్క గ్రామాల నుండి వచ్చి చదువుతున్న ఏడుగురు విద్యార్థినులకు అట్లాంటా లోని ప్రవాస భారతీయుడు వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామవాసి బుస్సా నాగరాజు మిత్రబందం బుధవారం కలెక్టరేటులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా సైకిళ్లను పంపిణీచేశారు. .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సైకిళ్లు బహుకరించిన వారి దాతత్వం మరువలేనిదని, వారికి కతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. సైకిల్ తొక్కడం ద్వారా శారీరక, మానసిక అభివద్ధి కలుగుతుందని, తద్వారా చురుకుదనం పెరుగుతుందని అంటూ తనకు కూడా సైకిల్ తొక్కడం అంటే ఎంతో ఇష్టమని విద్యార్థినులతో తన బాల్య స్మతులు పంచుకున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశి కుమార్, బుస్సా రమేష్, వెంకటేశ్వర్లు, అంజని కుమార్, జమ్మయ్య పాల్గొన్నారు.