Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపు హైదరాబాదులో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.బుధవారం పట్టణం లోని సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటిత,అ సంఘటితరంగంలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం అన్ని రంగాల కార్మికులు రేపు హైదరాబాద్కు తరలిరావాలని కోరారు.సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను ఉధతం చేయాలని కోరారు.రాష్ట్రంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తుం దన్నారు.ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.ముత్యాలు, వట్టెపు సైదులు, బి.స్వరాజ్యం, మల్లెల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.