Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
పశువుల్లో బ్రూసెల్లాసిస్ వ్యాధి సోకకుండా మండల పశు వైద్యాధికారి డాక్టర్ నాగేంద్ర పశువులకు టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించారు.బుధవారం గానుగబండ గ్రామంలోని లేగ దూడలకు ఉచితంగా బ్రూసెల్లాసిస్ వ్యాధి నిరోధక టీకాలను వేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నుంచి ఎనిమిది నెలల వయస్సు ఉన్న ఆడ లేగ దూడలకు బ్రూసెల్లాసిస్ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు.ఈ వ్యాధి పశువులలో అనారోగ్యాన్ని కల్గించడమే కాకుండా మనుషులకు కూడ వ్యాపించే అవకాశం ఉందన్నారు.ఈ వ్యాధిని నివారించేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు.కార్యక్రమంలో 41 దూడలకు టీకాలు వేశామన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది శేఖర్, గోపి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.