Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
ఈనెల 5 వ తేది నుండి మొదలైన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు గతంలో కంటే ఎక్కువగా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టింది. బందోబస్తు, రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ పకడ్బందీగా చేశారు.దొంగతనాలు జరగకుండా మఫ్టిలో పోలీసులను నియమించారు.విజయవాడ జాతీయ రహదారి పై ట్రాఫిక్ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాలుగు రోజుల నుండి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి బుధవారం ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్వయంగా భోజనాలు వడ్డించారు ఎటువంటి సమస్యలు రాకుండా విజయవంతంగా జాతర నిర్వహణలో సహకరించిన పోలీసులకు జిల్లా పోలీసు బాస్ స్వయంగా భోజనం వడ్డించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు నాగభూషణం, వెంకటేశ్వర్ రెడ్డి, సుధాకర్ పివిసి యాజమాన్యం, సిఐ సోమనారాయణ సింగ్, ఎస్సై విష్ణుమూర్తి సిబ్బంది పాల్గొన్నారు