Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలో అరుదైన శస్త్ర చికిత్స చేయగా విజయవంతం అయ్యింది. కాలు, చెయ్యి విరిగితే ఆపరేషన్ చేస్తారని తెలుసు.అలాగే మోకాలు చిప్ప మార్పిడి, తొంటి మార్పిడి గురించి వింటున్నాం.కానీ మోచేయి కీలు మార్పిడి మొదటిసారిగా వింటున్నాం. విజ్ఞాన పరంగా రోజు రోజుకి అభివద్ధి చెందుతున్న తరుణంలో అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో పేదల కోసం అరుదైన ఆపరేషన్ చేసి విజయం సాధించారు. పేదలు కోసం ఇటువంటి సౌకర్యాలు పట్టణంలో అందుబాటులో ఉంటాయని అసలు ఆపరేషన్ చేస్తారని కూడా తెలియని రోజుల్లో పేదలు సేవలను వాడుకొని ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. వివరాల ప్రకారం నూతనకల్ మండలం తాళ్ల సింగారం పరిధిలోని సోమ్లా తండా కు చెందిన మూడు అంజమ్మ గత సంవత్సరం క్రితం గేదెకు మేత వేస్తుండగా దాడి చేయగా కింద పడడంతో ఎడమ మోచేయి కీలు విరిగింది.అప్పటి నుండి ఆమె చేయి తటస్థంగా ఉండటంతో సంవత్సర కాలంగా బాధపడుతూ ఉంది. పేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేరగా ఆపరేషన్ చేశారు .కానీ అంతగా విజయవంతం కాకపోవడంతో ఆమె నరక యాతన పడుతున్న క్రమంలో బంధు, మిత్రుల సలహాతో జిల్లా కేంద్రం లోని గణేష్ ఆసుపత్రికి చేరింది.వెంటనే హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఎం రవీందర్,మత్తు డాక్టర్ నాగేందర్ సహాయంతో అంజమ్మ చేతికి మోచేయి కీలు మార్పిడి కోసం ఇంప్లాంట్ ను వేసి ఆపరేషన్ చేశారు. సుమారు ఐదు లక్షలు విలువచేసే ఆపరేషన్ ను అతి తక్కువ ఖర్చులతో అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ చేయగా విజయ వంతం అయిందని డాక్టర్ రవీందర్ బుధవారం విలేకరులకు తెలిపారు. కేవలం పది రోజుల్లోనే మామూలు చేయి వలె పని చేయడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి ఆపరేషన్ అవసరం ఐన పేద వారికి మున్ముందు కూడా తక్కువ ఖర్చుతో తన సేవలను అందిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా అంజమ్మ బంధువులు డాక్టర్ రవీందర్‌ను అభినందించి ధన్యవాదములు తెలిపారు.