Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారో మారు ఉదారతను చాటిన మంత్రి జగదీశ్‌రెడ్డి
- నిర్వహణ లోపంతో డైరీలో నష్టపోయిన దళిత యువకుడికి ఆపన్నహస్తం
- మరో నాలుగు బర్రెల కోసం రెండు లక్షలు ఇస్తానన్న మంత్రి
- మంత్రి పెద్ద మనస్సుకు జై కొట్టిన బీజేపీకి చెందిన శ్రీకాంత్
నవతెలంగాణ-సూర్యాపేట
రాజకీయాలు ముఖ్యం కాదు... యువకుల భవిష్యత్తునే తనకు ముఖ్యం అని మరోసారి తన ఉదారత ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చాటి చెప్పారు. పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీజేపీి కార్యకర్త గా ఉన్నాడు. రెండేండ్ల క్రితం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ తో దళిత కుటుంబాలకు డెయిరీ యూనిట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా శ్రీకాంత్ కు కూడా డెయిరీ యూనిట్ మంజూరు అయింది. యూనిట్ లు మంజూరు చేసే క్రమం లో పార్టీలు చూడవద్దని మంత్రి ఆదేశాలను పాటించిన అధికారులు, శ్రీకాంత్ కు డెయిరీ మంజూరు చేశారు. హర్యానా గేదె లను తెచ్చిన శ్రీకాంత్ నిర్వహణ లోపం, అవగాహన లోపం తో తన వల్ల కాదని వాటిని అమ్మేశాడు. ఈ క్రమం లో బ్యాంక్ రుణం మిగిలిపోయింది.ఈ క్రమంలో మంగళ వారం కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించడానికి మాచారం గ్రామానికి వెళ్ళిన మంత్రి జగదీష్ రెడ్డి ని శ్రీకాంత్ కలిశాడు.మీరు లోన్ ఇవ్వడం వల్లే తనకు నష్టం వచ్చిందని శ్రీకాంత్ చెప్పడం తో డెయీరీ నిర్వహణ లో అవగాహన రాహిత్యానికి తోడు అమా యకత్వానికి కోపం వ్యక్తం చేస్తూనే మంత్రి శ్రీకాంత్‌ను దగ్గరకు తీసుకుని డెయిరీ నిర్వహణ లోపం తోనే నష్టం వాటిల్లందని పలు సూచనలు చేశారు. నీకు నిజంగా బాగుపడాలనే ఉద్దేశ్యం ఉంటే మారో రెండు లక్షలు నెను ఇస్తాను, మళ్లీ డైరీ యూనిట్ స్టార్ట్ చేయమని శ్రీకాంత్ కు మంత్రి సవాల్ విసిరారు.తన పార్టీ కాదని తెలిసి కూడా మంత్రి తనకు రెండు లక్షలు ఇస్థాననడంతో షాక్ తిన్న శ్రీకాంత్ చెమ్మగిల్లిన కళ్ళ తో మంత్రిని హత్తుకొని కతజ్ఞతలు తెలిపాడు. పార్టీల పేరుతో యువకులను రెచ్చ గొట్టి రాజకీయాలు చేసే నాయకులను చూశాను కానీ,యువకులు శ్రేయస్సు కోసం తపించే నాయుకుడు జగదీష్ రెడ్డి అని శ్రీకాంత్ ఈ సందర్భంగా కొనియాడారు.