Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో హాత్ సే హాత్ జోడోయాత్ర పాదయాత్ర రెండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారికి వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధి సుంకర బోయిన నరసింహ, మాజీ ఎంపీపీ లింగాల మల్లీశ్వరి వెంకన్న, డీసీసీ కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాచకొండ లింగయ్య గౌడ్, నాయకులు బొప్పని యాదగిరి, నకిరేకంటే శ్రీను, వంటేపాక వెంకన్న, స్వప్న, వెంకటమ్మ, సుంకర సైదులు, మేడి నాగరాజు, కొండ నారాయణ, సిహెచ్.శ్రీరంగం పాల్గొన్నారు.