Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ కే.అపూర్వరావు
నవతెలంగాణ-నల్లగొండ
ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని ఎస్పీ కే.అపూర్వరావు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సరియైన పత్రాలు, రాంగ్ డ్రైవింగ్, నో హెల్మెట్, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నో పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, విత్ ఔట్ సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి వాటిపై టు విల్లర్స్ వాహనాలు 388, త్రి విల్లర్ వాహనాలు 14, ఫోర్ విల్లర్స్ వాహనాలు 114, ఇతర వాహనాలు 52 మొత్తం 568 వాహనాలపై కేసు నమోదు చేసి రూ.2,04,200 పైన్ విధించినట్టు తెలిపారు. వాహన దారులు వాహనానికి సంబందించిన సరియైన పత్రాలు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ ప్లేస్‌లలో మద్యం తాగితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.