Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఫిబ్రవరి 9న చేతి వత్తిదారులకు ఇండ్లు, స్థలాలు, బడ్జెట్ వాటా పెంచాలని నిర్వహించే చలో అసెంబ్లీ ధర్నాలో పెద్ద ఎత్తున చేతి వత్తిదారులు పాల్గొని జయప్రదం చేయాలని చేతి వత్తి దారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో అవిశెట్టి శంకరయ్య అధ్యక్షతన జరిగిన చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా సదస్సుకు ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్వహిస్తున్న బడ్జెట్ సమావేశాల్లో వత్తిదారులకు కేటాయించిన బడ్జెట్ వత్తిదారులను మోసం చేసే విధంగా, వారి అభివద్ధికి ఏమాత్రం ఉపయోగపడకుండా ఉందన్నారు. జనాభాలో అత్యధిక భాగంగా ఉన్న ప్రజల అభివద్ధి కోసం బడ్జెట్లో అత్యధికంగా వాటా ఇవ్వకుండా ఆ వర్గాలను ఎలా అభివద్ధి చేస్తారని ప్రశ్నించారు. రోజురోజుకు వత్తులు కోల్పోయి ఉపాధి లేకుండా వత్తులను వదిలేసి వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇంత కాలమైనా ఇంకా కూడు, గుడ్డ, ఇంటి స్థలాల కోసం అడుక్కోవలసిన దుస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని విమర్శించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పెట్టిన బడ్జెట్ను సమీక్షించి అత్యధిక వాటా ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ఇండ్లు, స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని సదస్సులో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొండా వెంకన్న, చౌగాని సీతారాములు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కందగట్ల గణేష్, రజక వత్తిదారుల సంఘం నాయకులు చెరుకు పెద్దలు, పీ.శ్రీనివాసులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు సైదులు, వడ్డెర వత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వరికుప్పల ముత్యాలు, కంసాలి వత్తిదారుల సంఘం నాయకురాలు ఎస్.పల్లవి, జే. రాఘవేంద్ర, వత్తి సంఘాల నాయకులు కర్నాటి మల్లేశం, జేరిపోతుల ధనంజయ, సాగర్ల మల్లేశం, అయితరాజు నరసింహ, అయిత రాజు యాదయ్య, తదితరలు పాల్గొన్నారు.