Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో నార్కట్‌పల్లిలో బటర్ ఫ్లై డివైడర్‌తో సుందరంగా రోడ్లు..
- రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్లు విస్తరణ
- 22 కోట్లతో మంజూరు ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
గత 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నార్కట్‌పల్లి పట్టణ విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. రోడ్లు, భవనాలశాఖ అధికారులు రోడ్డుకు విస్తరణ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే పట్టణంలో ఇరుకుగా ఉన్న రహదారిని విస్తరణ చేయడానికి సర్వేని ప్రారంభించారు. బుధవారం పట్టణంలో రోడ్లు, భవనాల అధికారులు సర్వేలు నిర్వహించి విస్తరణకు దిశా నిర్దేశించారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించి ఉన్న భవనాలు తాత్కాలికంగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
త్వరలో నార్కట్‌పల్లిలో బటర్ ఫ్లై డివైడర్‌తో సుందరంగా రోడ్లు..
అనాదిగా వెనుకబడిన నార్కట్‌పల్లి పట్టణం త్వరలోనే బటర్ ఫ్లై విద్యుత్ దీపాలతో డివైడర్ నిర్మాణం చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆర్ అండ్‌బీ అధికారులు ప్రత్యేకంగా నమూనాను సిద్ధం చేస్తూ కసరత్తు మొదలుపెట్టారు. సర్వే అనంతరం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టి విస్తీర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.
రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల విస్తరణ
నార్కట్‌పల్లి పట్టణంలో పాత జాతీయ రహదారి 9 ని అభివద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో రోడ్డు మధ్యలో నుంచి రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ట విస్తరణకు సిద్ధం చేస్తున్నట్లు ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొంటున్నారు. పట్టణంలో మూడున్నర కిలోమీటర్లు విస్తరణకు కావలసిన అన్ని హంగులను సంసిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
22 కోట్లతో మంజూరు ఉత్తర్వులు జారీ
పాత జాతీయ రహదారి 9 ని విస్తరించేందుకు ఉన్న అడ్డం కులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 22 కోట్లు మంజూరు చేస్తూ గత రెండు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు విస్తరణ కోసం ఆర్ అండ్‌బీ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.