Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కొర్ర సైదానాయక్ ఆరోపించారు. బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించినందుకు నిరసిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరొకసారి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. మొత్తం బడ్జెట్ 2,90396 కోట్లల్లో కేవలం 19093 కోట్ల కేటాయింపులు 6.57 శాతంకి మాత్రమే పరిమితం చేయడం విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందన్నారు. పాఠశాల విద్యాశాఖకు కేవలం 16092 కోట్లు (5.54శాతం), ఉన్నత విద్యకు 3001 కోట్లు (1శాతం) కేటాయించారని తెలిపారు. మొత్తం బడ్జెట్ల్ కనీసం 10శాతం నిధులు కూడా కేటాయించలేదని విమర్శించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ చిత్త శుద్ది ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుందన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు యూనివర్సిటీ లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోవు అన్నారు.నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచలేదని, విద్య రంగం అభివద్ధి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయిందన్నారు. యూనివర్సిటీలో పరిశోధన చేసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యూనివర్సిటీలపైన ప్రత్యేక దుష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ జగన్నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకాష్, సమద్, లోకేష్, ఆనంద్, అఖిల్, సాయి, ఈశ్వర్, పండు, శ్రీకాంత్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను బుధవారం స్థానిక జాతీయ రహదారిపై దగ్ధం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గుడిగ వెంకటేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి కేవలం 19093 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయం, గత సంవత్సరం కంటే నిధులు తగ్గించడం సరికాదన్నారు. విద్యారంగానికి 30శాతం నిధులు ప్రభుత్వ కేటాయించాలని డిమాండ్ చేశారు. చాలీచాలని బడ్జెట్తో విద్యారంగాభివద్ధి ఎలా సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రాహుల్, చందు, శ్రావణ్, అనిల్, రాజు, రవి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.