Authorization
Tue March 18, 2025 03:06:13 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండలంలోని తొండ,మామిడాల రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత దశలో పంటల పరిస్థితి, పంటలకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేశారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తెలిపారు.ఈ పథకానికి మండలంలో469 మంది ఈకేవీఐసీ చేసుకోలేదన్నారు.వారంతా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలన్నారు.ఇంకా 208 మంది రైతులు అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేసుకోలేదన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకటరెడ్డి, శ్రీను,సర్పంచ్ బెడిద కర్నాకర్, రైతులు పోతరాజు వెంకటయ్య,దుపాటి యాదయ్య, శ్రీశైలం, ఇస్లావత్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.