Authorization
Sat March 15, 2025 08:16:36 pm
- ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రజా సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతానని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వృథాగా పోతున్న మూసీి జలాలను వినియోగంలోకి తేవాలని లక్ష్యంతో బునాది గాని కాల్వపనులను 2006 సంవత్సరంలో శంకుస్థాపన చేసిన సంగతి గుర్తు చేశారు. బీబీనగర్ మండలం లోని మక్త అనంతరం గ్రామం నుండి మోత్కూరు మండలంలోని ధర్మారం ఊర చెరువు వరకు కాలువలను నిర్మించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలను ఈ కాలువ ద్వారా అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టు పేర్కొన్నారు. వీరవల్లి వద్ద కాళేశ్వరం జలాలను బునాదిగాని కాలువలో పంపిం చాలని నిర్ణయించి నట్టు తెలిపారు. దీని వల్ల భూసేకరణ చేపట్టాల్సిన అవసరంఉండక పోవడమే కాకుండా వందల కోట్ల రూపాయల వరకు వ్యయం ఆదా చేసిన వారమవుతామని పేర్కొన్నారు.