Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
జ్ఞానంతో కూడిన విద్య వల్లనే,విద్యార్థుల మేధాశక్తి ప్రజ్వరిల్లి బావిభారత పౌరులను తీర్చిదిద్దుకోగలమని మండలపరిధిలోని గిరిజనసంక్షేమ గురుకులకళాశాల వైస్ ప్రిన్సిపాల్ నీలారాణి అన్నారు.మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సివి రామన్ చిత్రపటానికి పూలమాలలేసి జ్యోతిప్రజ్వలనగావించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.సివి రామన్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించాలని సూచించారు.విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్‌ఫేర్ చాలా ఉపయోగపడుతుందన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలను ప్రదర్శించి,అవి పనిచేసే విధానాన్ని అందరికీ వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు పలువుర్ని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం వేణుగోపాల్, షేక్ సలీం, రమాదేవి, స్వరూప, రజిని ,బింగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.