Authorization
Wed March 05, 2025 02:02:12 am
నవతెలంగాణ-హుజూర్నగర్
మండలపరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో నవ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇన్చార్జి బీవీఎన్. పద్మరాజు తండ్రి బొల్లేపల్లి వెంకటరాజు మతికి నవ తెలంగాణ సిబ్బంది సంతాపం తెలిపారు.ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలలేసి నివాళులర్పించారు.జీవితాంతం పార్టీలో ఉంటూ సీపీఐ(ఎం) బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఆయన మృతి తీరని లోటన్నారు.ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ స్టేట్ సిబ్బంది అజరు,మధుకర్, శశికళ, లలిత, జిల్లా బాధ్యులు పుప్పాలమట్టయ్య ,పురుషోత్తం, దయాకర్‌రెడ్డి, దుగ్గి విజరు, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి పోతనబోయిన హుస్సేన్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నాగవరపు పాండు, పల్లె వెంకట్‌రెడ్డి, గోపరాజు వెంకటచంద్ర, దుగ్గి బ్రహ్మం, పారుపల్లి శ్రీనివాసరావు నగర్,ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కోలా నాగేశ్వరరావు, ఆంధ్రప్రభ రిపోర్టర్ డి. శేషం రాజు, జనం సాక్షి రిపోర్టర్ అంజయ్య, ప్రజాపక్షం రిపోర్టర్ పిల్లలమర్రి శ్రీను,మద్దూరి వెంకట్‌రెడ్డి,రాంప్రసాద్, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.