Authorization
Mon March 03, 2025 08:30:20 pm
- సీపీఐ(ఎం) మండలకార్యదర్శి గంగదేవి సైదులు
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 13న చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని గట్టు శ్రీరాములు ఫంక్షన్హాల్లో 10.30 గంటలకు సీపీఐ(ఎం) జిల్లా విస్తతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ మండలకార్యదర్శి గంగదేవి సైదులు కోరారు. శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 13న ఉదయం 10.30 గంటలకు జెండావిష్కరణతో సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కర్తవ్యాలు చర్చించనున్నట్టు తెలిపారు. పార్టీ రాజకీయ విధానాన్ని వివరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా, మండలకమిటీలు, గ్రామశాఖ కార్యదర్శులు, ప్రజాసంఘాల సభ్యులు, పార్టీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఉపసర్పంచ్లు, చైర్మెన్లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.