Authorization
Sat March 15, 2025 10:39:14 am
- సామాజిక కార్యకర్త పీఏ.దేవి
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశంలో, రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని సామాజిక కార్యకర్త పీఏ.దేవి అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని చందన స్కూల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మాయిలు బాగా చదవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును ఆపొద్దన్నారు. ఆడపిల్లలు ఆత్మగౌరవం ఉండే విధంగా జీవించాలన్నారు. జీవితంలో బాగా చదివి తన కాళ్లపై తాను నిలబడే విధంగా ఉద్యోగం చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవంగా ఉంటామన్నారు. అనంతరం ఆమెను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, నాయకులు బత్తుల జయమ్మ, ఉపాధ్యాయురాలు స్వప్న, నర్మద, పద్మ, గీత, రేణుక, అర్చన, సౌమ్య, జగదీశ్వరి, ఉషారాణి, వివిధ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.