Authorization
Sat March 15, 2025 11:00:33 am
నవతెలంగాణ- భువనగిరిరూరల్
హత్ సే హత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్యకర్తలను పిలుపునిచ్చారు. గురువారం స్థానిక గెస్ట్ హౌస్ లో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 16నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగడతామని తెలిపారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పోత్నక్ ప్రమోద్ కుమార్, తంగేల్లపల్లీ రవి కుమార్, బీస్కుంట్ల సత్యనారాయణ , బర్రె జహంగీర్,ఈరపక నరసింహ, సలవద్దిన్, కైరంకొండ వెంకటేష్, ఎం డి మాజార్, శ్రీను, ఆధినరయన, రాషధ్, తహెర్, కృష్ణయాదవ్, బాలరాజు నరసింహాలు పాల్గొన్నారు.