Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి రూరల్
తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసిస్టెంట్ నూతన డైరీ ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వి.కృష్ణ శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మూగజీవాలకు సేవలు అందించడంలో, వాటి సంరక్షణకు ముందుండి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు నాన్ గెజిటెడ్ వెటర్నియన్స్ కృషి అద్భుతమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ వి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడంలో వెటర్నరీ అసోసియేషన్ సేవలు మరువలేవన్నారు. టీఎన్వీజీఏ వెటర్నరీ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ గోపిరెడ్డి, జిల్లా కార్యదర్శి భూషబోయిన నరసింహ యాదవ్, కోశాధికారి ఆర్ నరేష్, ఉపాధ్యక్షులు నల్లమసు ఉపేందర్ గౌడ్, నల్లమసు జహంగీర్, క్రాంతి రేఖ, శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మల్లేష్, రేణుక , మహేందర్, రేఖ పాల్గొన్నారు.