Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్మెన్ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
ప్రయివేటు పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం శాయశక్తులుగా కృషి చేస్తుందని జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలో భీమనపల్లి, దంతూరు గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మన ఊరి మనబడి పథకం కింద రూపొందిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు రైతులకు రుణమాఫీ రైతుబంధు ఉచిత విద్యుత్తు. పేదలకు విద్య వైద్యం అందుతుందని తెలిపారు. తరగతి గదిలో బోర్డుపై ఎ ప్లస్ బి హౌల్ క్యూబ్ ఫార్ములా ను రాసి, తరగతి గదిలో కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కప్ రాయి పల్లి ఎమ్మెల్సీ సిడిపి నిధులు 13 లక్షల 50 వేల రూపాయలతో కమ్యూనిటీ భవన నిర్మాణం పనులు శివారెడ్డి గూడెం 13 లక్షల 50 వేల రూపాయలతో కమ్యూనిటీ భవన నిర్మాణం ధర్మ రెడ్డిపల్లి గ్రామం 13 లక్షల 50 వేల రూపాయలతో కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలోని గ్రామాలు మరింత అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. భీమనపల్లి కనుముకుల గ్రామాల శివారులో బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రోడ్డు పక్కన గాయాలతో పడి ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చూసి హుటాహుటిన కానువాయిలో ఎక్కించి పోలీస్ సహకారంతో ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం అందించి కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు కర్నాటి రవి, గుండు మధు సామల మల్లారెడ్డి దేవరారు కుమారు మేనేజర్పిఎసిఎస్ చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచులు ; తదితరులు పాల్గొన్నారు.