Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాల :ప్రతి ఒక్కరూ చిరు ధాన్యా లను ఆహారంగా తీసుకొని తమలో రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకోవాలని కోదాడ సీడీపీఓ విజయ చంద్రిక తెలిపారు. చిరు ధాన్యాల వినియోగంపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ర్యాలీని గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మునగాల సూపర్వైజర్ అంజమ్మ, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, ఏఎన్ఎంలు సుజాత, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సంధ్యారాణి, మణెమ్మ, రూప, మణి, ఎల్లమ్మ, కమల పాల్గొన్నారు.