Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంలోని వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు
- బస్సులోని 52 మంది ప్రయాణికులు క్షేమం
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
జాతీయ రహదారి- 65 పై ఆర్టీసీ బస్సును వెనక నుండి డీసీఎం ఢకొీట్టింది. ఈ సంఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమండ్రి నుండి కూరగాయల లోడుతో డీసీఎం హైదరాబాద్‌కు వెళ్తుంది. సత్తుపల్లి నుండి హైదరాబాదుకు 52 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు వెళ్తుంది. లింగోజిగూడెం సమీపంలోని ఎన్ హెచ్ 9 హౌటల్ ఎదురుగా రోడ్డు పక్కన బస్సు నిలిపి ఉంచారు. అదే సమయంలో వస్తున్న డీసీఎం బస్సును వెనుక నుండి బలంగా ఢ కొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన పల్టీ పడ్డాయి. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు తగిలి బస్సు పూర్తిగా పల్టికి పడక నిలిచిపోయింది. గోదావరి జిల్లా పైడి చింతపాడు గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ ఘంటసాల శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న మరో వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా పైడి చింత పాడు గ్రామానికి చెందిన సైదులు బాలకృష్ణ (45) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. డీసీఎంలో ఉన్న వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ సిఐ మల్లికార్జున్ రెడ్డి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.