Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిగె సోములు
నవతెలంగాణ -రామన్నపేట
భవన నిర్మాణ వృత్తిపై ఆదారపడి జీవిస్తూ అనారోగ్యం పాలై మృతి చెందిన మండలంలోని ఇస్కిళ్ళ గ్రామ భవన నిర్మాణ కార్మికురాలు ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిగె సోములు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఇస్కిళ్ల్ల గ్రామంలో కిష్టమ్మ భౌతికకాయంపై మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, నాయకులతో కలసి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించి ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పడాలన్నారు. పెరిగిన ధరలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు వృత్తినే ఆధారం చేసుకుని అనారోగ్యంపాలై వైద్యం చేయించుకునే స్థోమత లేక మరణిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గొరిగె ఆదిమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.