Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
బాగా చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బొల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సచిన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే పదో తరగతి పునాది వంటిదన్నారు. మంచి గ్రేడుతో ఉత్తీర్ణత సాధించి కష్టపడి చదివి, ఉన్నత స్థితికి ఎదగి, తల్లి దండ్రుల కలలను నెరవేర్చాలన్నారు. ఎవరెస్టర్ అన్విత మాట్లాడుతూ ఏ తల్లి దండ్రులైనా తమ పిల్లలు మా కంటే ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటారని, తల్లి దండ్రులు మన ఎదుగుదలను చూసి గర్వంగా పది మందికి చెప్పుకోవాలన్నారు. అప్పుడే జీవితంలో విజయం సాధించినట్టని అన్నారు.అనంతరం విజేతలు గాయత్రి, సాయి నిరుపమ్, హర్షికతో పాటు పలువురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు రాంబాబు, ఉపాధ్యాయులు విజయేందర్ రెడ్డి, పద్మలత, స్వామి, శ్రీనివాసాచారి, మున్ని, గోదావరి, రాజేశ్వరి, కనకయ్య పాల్గొన్నారు.