Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలగాణ-చౌటుప్పల్
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం రామన్నపేట ప్రాజెక్టు చౌటుప్పల్ సెక్టార్లోని చౌటుప్పల్ 2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పిల్లలకు అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లులు రక్తహీనత లేకుండా పిల్లలు మంచి పోషణ స్థాయిని కలిగి ఉండాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ తల్లులు అంగన్వాడీ సేవలను, ఆరోగ్య లక్ష్మీని ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. చిరుధాన్యాలు, మిల్లెట్స్, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అందెకొర్రెలు ఉపయోగించుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కామిశెట్టి శైలజ, అధికారులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.