Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్ట పట్టణ బస్టాండ్ యథావిధిగా కొనసాగించాలి : పల్లా వెంకటరెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
దేవుడు ఉన్న యాదగిరిగుట్ట పట్టణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణ బస్టాండు, పరిసర ప్రాంతాలను ఆయనతో పాటు , సీపీఐ జిల్లా పార్టీ బృందం పరిశీలించి స్థానిక ప్రజల ఇబ్బందులను తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణ బస్టాండ్ యధావిధిగా కొనసాగిం చాలన్నారు. యాదగిరిగుట్ట దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టే ముందే ఇక్కడి స్థానిక శాసన సభ్యురాలు నాయకత్వంలో అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలతో చర్చించి సంతృప్తి పరిచి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని నిర్మాణ పనులు చేపడితే ప్రజలకు సమస్యలు లేకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదని తెలిపారు.దేవాలయం బస్టాండ్ ఆధారంగా గతంలో నుండి వేలాదిమంది జీవన ఉపాధి పొందుతున్నారని,అందరి ఉపాధికి నష్టం జరిగే విధంగా ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయన్నారు.మొదటగా అనేక సంవత్సరాలుగా కొండపైకి ఆటోలు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులను నాలుగు ఘాటు రోడ్లు ఉన్నప్పటికీ కొండపైకి అనుమతించకపోవడంవల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఈ న్యాయమైన దానికి తమ పార్టీ గా మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, జిల్లా సమితి సభ్యులు బబ్బురి శ్రీధర్, పెరబోయిన మహేందర్, ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మంద శంకర్,బండి అనిల్ ,గుండ్లపల్లి శ్రీరామ్, బట్టు సతీష్ రాజ్, గుండు నరసింహ, బొజ్జ సాంబేష్, పేర బోయినబంగారి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.