Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కచ్చీరు భూమిని అన్యాక్రాంతం నుండి కాపాడాలి
- సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డులో ఉన్న కచ్చీరు భూమికి అక్రమంగా కట్టిన ప్రహారీని తొలగించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) మున్సిపల్కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మున్సిపాలిటీ కార్యదర్శి బండారు నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా మాట్లాడారు. చౌటుప్పల్ గ్రామం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పట్టణంలో జరిగే అన్ని పండుగలు, గ్రామాభివృద్ధిపై జరిగే చర్చా వేదికగా ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి, రచ్చబండ వేదికలాగా కచ్చీరు భూమి ఉందన్నారు. కావాలని కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలతో అట్టి భూమిని కబ్జా చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా ప్లాట్లు చేసేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి, ఇట్టి కచ్చీరు భూమిని అక్రమార్కుల నుండి కాపాడాలని డిమాండ్‌చేశారు. భూమిని కాపాడని యెడల పెద్ద ఎత్తున సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కచ్చీరు భూమి అన్యాక్రాంతం కాకుండా తన వంతుగా తక్షణ చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు దండ అరుణ్‌కుమార్, బత్తుల లక్ష్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతకింది పాండు, ఉష్కాగుల రమేశ్, శ్రీను, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, పాశం రామరాజు, తొర్పునూరి మల్లేశం, దేప రాజు, గుర్రం నర్సింహా, చీకూరి ఈదయ్య, బొడ్డు రాజు, నెల్లికంటి నర్సింహా, గుణమోని రాములు, పల్చం ఉత్తరయ్య, దాడి సురేందర్‌రెడ్డి, భావండ్లపల్లి స్వామి, కొత్త సత్తయ్య, ఎర్ర ఊషయ్య, బొమ్మకంటి కృష్ణ, గంజి రామచంద్రం, పర్నె ధర్మారెడ్డి, బిక్షపతి, శ్రీశైలం, మహేశ్ పాల్గొన్నారు.