Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మండలపరిధిలోని కలకోవ గ్రామంలో సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మత్స్యకార్మిక విజయోత్సవ సభను నిర్వహించారు.మార్చి14న జరిగిన మత్య్స సహకార ఎన్నికలో సీపీఐ(ఎం) ఘన విజయం సాధించిన విషయం విధితమే.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు అ నంతు గురవయ్యను ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.మత్య్స సహకార సంఘం అధ్యక్షులు గురవయ్యతో పాటు కమిటీ సభ్యులను సన్మానించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మండల కార్యదర్శి చందా చంద్రయ్య విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు.మత్స్య సహకార ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని ప్రలోభాలు పెట్టి గురిచేసిన వాటిని తిప్పికొడుతూ సంఘం సభ్యులు ఐక్యంగా నిలబడి అధికార పార్టీ ఎత్తులను జిత్తులను తిప్పికొట్టారని తెలిపారు.మత్స్య సహకార సంఘాన్ని ఎన్నికల్లో సీపీఐ(ఎం) గెలవడం ప్రత్యర్దులకు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. పట్టుదలతో ఎన్నికల్లో గెలిచిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ సత్యనారాయణ, పార్టీ మండల నాయకులు ఎస్కె సైదా, వీరబోయిన వెంకన్న, బచ్చలకూర స్వరాజ్యం, దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, జూలకంటి విజయలక్ష్మి, ఉపేందర్, గోపయ్య, మంగయ్య, కృష్ణారెడ్డి, వెంకటాద్రి, వెంకటకోటమ్మ, సతీష్,వెంకన్న, ధర్మయ్య పాల్గొన్నారు.