Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ప్రపంచ రంగస్థలం సందర్భంగా స్థానిక గాంధీపార్క్ సెంటర్లో సీనియర్ కళాకారులు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థలం వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ కళాకారులు మాట్లాడుతూ గాంధీపార్క్ సెంటర్ లో కళారంగానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చి రంగస్థలం ప్రదర్శనకు ఉపయోగించే విధంగా ప్రభుత్వం చేయాలన్నారు.అంతరించిపోతున్న కలలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద న్నారు. అర్హులైన కళాకారులకు ఇండ్లు, స్థలాలు, పెన్షన్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం రంగస్థలం కళా కేంద్రాలకు కార్టూన్లను, రంగస్థలం సంగీత పరికరాలను,ఇతర సామగ్రిని సమకూర్చి కళారంగాన్ని ప్రోత్సహి ంచాలన్నారు.ఈ కార్యక్ర మంలో బాచిమంచి కొండయ్య, చప్పిడిభిక్షం, ధూళిపాల రామకృష్ణ, బత్తిని మల్లయ్య, గోవింద్, కొట్టు బాబు, భద్రాచలం ,జి.వెంకటేశ్వర్లు, ఎస్కె.జాన్, సైదా, అన్నమ్మ, గొట్టె చంద్రయ్య, రాజు, గుండా రమేశ్, జేవీఎల్ పాల్గొన్నారు.