Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈదురుగాలులతో రాళ్ల వర్షం
- 1,200 ఎకరాల్లో వరి పంట నేల మట్టం
- 430 ఎకరాల్లో తోటలు ధ్వంసం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
అకాల వర్షం ఈదురుగాలులతో వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మండల పరిధిలోని అమ్మనబోలు, అక్కనపల్లి, పల్లెపహాడ్, చిప్పలపల్లి, చిన్నతమ్ములగూడెం, భాజకుంటలో ఆదివారం సాయంత్రం, రాత్రి ఉరుములు మెరుపులతో భారీ ఈదురు గాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. ఆరు కాలం కష్టించి పండించిన పంట కోతలకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్ష బీభత్సం రైతుల ఆశలపై నీళ్లు చల్లి కన్నీళ్లు మిగిల్చింది.
1,200 ఎకరాల్లో వరి పంట నేల మట్టం..
అమ్మనబోలు, అక్కనపలి,్ల పల్లెపహాడ్, చిప్పలపల్లి, చిన్నతమ్ములగూడెం, భాజకుంటలో అనుకోకుండా కురిసిన వర్షంతో 1,200 ఎకరాల్లో ఇరవై శాతం వరి నేల మట్టం అయినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అక్కనపల్లి గ్రామంలో ఎకరానికి 30 వేల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంటను రేపో మాపో కోతలు కోసి మార్కెటుకు తరలించాల్సి ఉండగా అకాల వర్షం కడగలను మిగిల్చింది అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కనపల్లి గ్రామంలో కంబాలపల్లి సంపత్ 20 ఎకరాలు, గాయం నరేందర్‌రెడ్డి 12 ఎకరాలు, కసిరెడ్డి సుధాకర్‌రెడ్డి 12 ఎకరాలు, శ్రీనివాస్ 12 ఎకరాలు, ఎండీ. ఖలీల్ 8 ఎకరాలు, జక్కలి మల్లేష్ 5 ఎకరాలు, మిడిదొడ్డి శంకరయ్య 14 ఎకరాలు, అక్కంపల్లి నారాయణరెడ్డి రెండు ఎకరాలు, గాయం వెంకటరెడ్డి 9 ఎకరాలు, కంబాలపల్లి సంపత్ ఇరవై ఎకరాలు, తరాల వెంకన్న నాలుగు ఎకరాలు, గాయం సత్యంరెడ్డి 5 ఎకరాలు, చిగుర్ల రాములు తొమ్మిది ఎకరాలు, చీరల జయమ్మ రెండు ఎకరాలు, ఖమ్మం పాటి వెంకన్న నాలుగ ఎకరాలు, ఖమ్మంపాడు శంకర్ మూడు ఎకరాలు, జీడికల్లు మూడు ఎకరాలు, ఆదిరెడ్డి ఐదు ఎకరాలు, సల్ల యాదయ్య నాలుగకురాలు, నాగరాజు పది ఎకరాలు, నరసింహ 5 ఎకరాలు, తరాల లక్ష్మమ్మ మూడు ఎకరాలు, మల్లారెడ్డి 6 ఎకరాలు, ఖమ్మం మెట్టు శీను మూడు ఎకరాలు, రఘు మూడెకరాలు ధనమ్మ మూడు ఎకరాలు, కన్యమైన చంద్రయ్య ఆరు ఎకరాలు, అండాలు 2 ఎకరాలు, శ్రవణ్ కుమార్ ఏడు ఎకరాల్లో వరి పొలం 60 శాతంపైగా నేల మట్టమయింది. రైతులు కన్నీరు మున్నీరై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
430 ఎకరాల్లో తోటలు ధ్వంసం
మండల పరిధిలోని అక్కనపల్లి, అమ్మనబోలు, గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులతో తోటలు ధ్వంసమయ్యాయి. మామిడి తోట 80 ఎకరాలు, నిమ్మ 300, కూరగాయలు 50, బొప్పాయి 5, జామ 5 ఎకరాల తోటలు ధ్వసమైనట్టు నకిరేకల్ నియోజకవర్గం ఉద్యానవన అధికారి రావుల విద్యాసాగర్ పేర్కొన్నారు.
అధికారులు ఆదుకోవాలి
కంబలపల్లి సంపత్ (రైతు అప్పనపల్లి)
మండల పరిధిలోని అక్కనపల్లి గ్రామంలో 20 ఎకరాలు నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాను. ఆదివారం వడగండ్ల వర్షంతో సుమారు 60శాతం పంట నీటిమట్టమయింది. వరి గింజలు మడిలో పడిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాను.
అధికారులకు ప్రాథమిక నివేదిక అందించాం
ఎడవల్లి గిరిప్రసాద్ (వ్యవసాయ అధికారి)
మండల పరిధిలోని అక్కనపెల్లి, అమ్మనబోల్ క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాలు అక్కెనపల్లి, చిప్పలపల్లి, చిన్న తుమ్మలగూడెం, భాజకుంట, పల్లెపాడు, అమ్మనబోలు గ్రామాలలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షాలకి పంట నష్ట తీవ్రత శాతం 20 నుంచి 30 లోపుగా నిర్ధారణ చేశారు. సోమవారం మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ ఏఈఓలు ఝాన్సీ శిరీషలతోపాటు అక్కనిపల్లి సర్పంచ్ మాదాసు చంద్రశేఖర్, అమ్మనబోలు సర్పంచ్ బద్దం వరలక్ష్మి రాంరెడ్డి, తుమ్మలగూడెం సర్పంచ్ దాసరి రాజు, ఆయా గ్రామాల ఎంపీటీసీలతో కలిసి సోమవారం ఆయా గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి అధికారులకు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఈమధ్య కురుస్తున్న అకాల భారీ వర్షాలు, వడగళ్ల వానకు వరి మాగానుల్లో పేరుకుపోయిన నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ అలాగే కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలని వీలైతే చైన్ మిషన్ల ద్వారా కోయించుకుని వరి ధాన్యాన్ని మీకు సంబంధించిన కల్లాలలో భద్రపరచుకొవాలని సూచించారు.