Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థ రసాయనాలను అత్యాధునిక టెక్నాలజీతో శుద్ధి చేయడం జరుగుతుందని దివిస్ పరిశ్రమ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ తెలిపారు.దివిస్ పరిశ్రమలో భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో వ్యర్థ రసాయనాలు శుద్ధి చేసే ప్లాంటును, శుద్ధి చేసే తీరును వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ఈటీపి ప్లాంట్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. పరిశ్రమ నెలకొల్పిన కాలంలో వ్యర్ధ రసాయనాల శుద్ధి కోసం టెక్నాలజీ లేకపోవడంతో కొంత ఇబ్బంది జరిగిందని అన్నారు. శుద్ధి చేసిన జలాలతో పరిశ్రమలోనే మొక్కలకు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ట్రీట్మెంట్ ప్లాంట్ మేనేజర్ రాఘవేంద్రరావు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ శివప్రసాద్, సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.