Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్/ఆలేరుటౌన్
రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యతా న్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో సత్యాగ్రహ సంకల్ప దీక్ష కార్యక్రమం మంగళవారం చేపట్టారు .ముం దుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు ఉపేందర్ రెడ్డి ,బీర్ల అయిలయ్య మాట్లాడుతూ భావి ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనారత రేటు వేసి ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు . ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండ్రు శోభారాణి ,మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ,మండల ఎంపీపీ గంధ మల్ల అశోక్, టౌన్ అధ్యక్షుడు ఎజాజు ,గుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్ ,యువజన విభాగం మండల అధ్యక్షుడు లోకేష్ ,ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్ ,గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు, శ్రీపాల్ రెడ్డి ,శ్రీనివాసు, కృష్ణమూర్తి ,విజేందర్ రెడ్డి ,అంజయ్య, వెంకటేష్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..