Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్థాన్‌నారాయణపురం:దేశంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు అరాచక పాలన చేస్తున్నాయని టీపీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడపగడపకు వివరించేందుకు సిద్ధమవుతుందన్నారు. పాలక పార్టీలు ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదానికి కట్టబెట్టిన అక్రమ ఆస్తుల చిట్టాను బట్ట బయలు చేస్తారనే భయంతో కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీని పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడం, అక్రమ కేసులు బనాయించడం నియంత పాలనకు నిదర్శనన్నారు. దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉందన్నారు. కార్యకర్తల మంత రాహుల్ గాంధీ వెంటే ఉంటామన్నారు.ఉప ఎన్నికల ముందు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్ తిరిగి మళ్ళీ చూడకపోవడం శోచనీయమన్నారు. మర్రిగూడ-మాల్ రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో రోడ్డు ప్రమాదానికి గురైన నలుగురు మృతి చెందారన్నారు. అసంపూర్తి రోడ్లను పూర్తి చేయాలన్నారు. మద్దతు ధర లేక పత్తి రైతులు పండించిన పత్తిని ఇళ్లలోనే పెట్టుకొని ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లేషన్ లో ప్రకటించిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాసమల్ల యాదయ్య, ఎండి.అక్బర్ అలీ, ఏపూరి సతీష్, చిలువేరు కృష్ణ, వత్తిపల్లి యాదయ్య, మీనుగు గోపాలు, జక్కడి చంద్రారెడ్డి, ఎండి.ముస్తఫా, ఎండి.ఈసా ఖాన్, చిలువేరు రమేష్, చిలువేరు బిక్షమయ్య పాల్గొన్నారు.