Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
విద్యార్థి జీవితంలో పదోతరగతి అత్యంత కీలకమైందని, విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సుధాకర్ పీవీసీ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహాదేవ్ అన్నారు. మంగళవారం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుధాకర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ప్రయివేట్ లిమిటెడ్, సూర్యాపేట వారి సౌజన్యంతో సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 1500 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించి మాట్లాడారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాస రాంకుమార్‌రెడ్డి విద్య, వైద్య, క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు.విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్, పాలిటెక్నిక్,టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్షలకు ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నట్టు తెలిపారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షాప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు,స్కేళ్ళు, ఎరేజర్లు, చాక్మార్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ చైర్మెన్ యాస రాంకుమార్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమణ, ఫౌండేషన్ ప్రధాన కారదర్శి పాల్వాయి వెంకన్న, సభ్యులు బత్తుల దామోదర్‌రెడ్డి, రుద్రంగి కాళిదాసు, సొల్లేటి ఉపేంద్రాచారి, ప్రతాప్, ప్రమీల, మూర్తి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.